ఇండిగో సిబ్బందిని గౌరవించండి ప్లీజ్: సోనూ సూద్
ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై నటుడు సోనూసూద్ స్పందించాడు. పలు విమానాల ఆలస్యం కారణంగా చాలా చోట్ల ప్రయాణికులు.. సిబ్బందితో గొడవపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా సిబ్బంది సమస్యలను అర్థం చేసుకోవాలని సూచించాడు. దయచేసి సిబ్బందిని గౌరవించాలని కోరాడు.