అప్పుల బాధతో యువ రైతు మృతి

అప్పుల బాధతో యువ రైతు మృతి

KDP: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లంపల్లికి చెందిన మూలే ఇంద్రసేనారెడ్డి(41) అనే యువ రైతు అప్పుల బాధ తట్టుకోలేక గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. మృతుడు గత కొంతకాలంగా వ్యవసాయం చేస్తూ.. వరుసగా నష్టాలు రావడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు తెలిపారు.