విద్యుత్ శాఖ బాధితుడి 172 రోజుల పోరాటం..!
PLD: కారంపూడి మండలం పెదకోదమగుండ్లలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల వికలాంగుడిగా మారిన వర్ల సాగర్ బాబు, న్యాయం కోసం గత 172 రోజులుగా పోరాడుతున్నాడు. తనను ఆదుకోవాల్సింది పోయి, ప్రమాదంతో తమకు సంబంధం లేదని రాతపూర్వకంగా రాసివ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని మంగళవారం కోరారు.