కేంద్రమంత్రి చెప్పిన పనులు ఆలస్యమే.!
కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో రూ.170 కోట్లతో 10 ఏళ్ల క్రితం ప్రారంభించిన నూతన టెర్మినల్ భవనం 30 నెలల్లో పూర్తికావాల్సి ఉండగా, 68 నెలలు గడిచినా పనులు ముందుకుసాగడం లేదు. కేంద్రమంత్రి 2 సార్లు పరిశీలించి హెచ్చరికలు చేసినా మార్పు లేక డిసెంబరు గడువు కూడా దాటిపోయింది. ఇంకా కనీసం 6 నెలలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. టెర్మినల్ ఆలస్యంతో బోయింగ్ సేవలు మొదలు కావడం లేదు.