ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు
ASR: ఎలమంచిలి పట్టణం కొత్తపేట జెడ్పీ హైస్కూల్ లో 2025-26లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గురువారం అవార్డులు, జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు అందజేశారు. హెచ్ఎం వైవీ రమణ మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విద్య దోహదపడుతుందన్నారు. క్రమశిక్షణ పట్టుదలతో విద్యనభ్యసించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుందూరు రాజు, కిరణ్ కుమార్, విజయ్ పాల్గొన్నారు.