ఈనెల 14న కరేడుకు రామచంద్ర యాదవ్

NLR: బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఈనెల 14వ తేదీన ఉదయం 11 గంటలకు ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామంలో జరిగే గ్రామసభలో పాల్గొంటారు. కరేడులో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండటంతో రామచంద్ర కరేడు రాకూడదని పోలీసులు తెలిపిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన కరేడు వెళ్లడానికి అనుమతి ఇవ్వడంతో ఆయన గ్రామానికి రానున్నారు.