VIDEO: ఉపాధ్యాయ పోటీలు ప్రారంభించిన స్పీకర్
AKP: నర్సీపట్నం డివిజనల్ ఉపాధ్యాయుల ఆటల పోటీలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల మానసిక ఉల్లాసం కలిగించే విధంగా ఆటల పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి ఆటల పోటీలలో నర్సీపట్నం ఉపాధ్యాయులు రాణించి తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.