మొక్కజొన్న కంకులతో నిరసన.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
TG: రాష్ట్ర అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ సభ్యుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. మొక్కజొన్న కంకులతో సభలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. లోపలికి అనుమతి లేదని స్పష్టం చేయడంతో పోలీసులపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు కంకులు బయటే వదిలివేసి సభలోకి వెళ్లారు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది.