సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
గద్వాల పట్టణంలోని బీమ్ నగర్ లో వెలసిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి నుండి 12 వరకు జరుగుతాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పుణ్యావచనం, అంకురారోహణం, ధ్వజారోహణం, బేరి పూజ, హోమం, తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. పండితులు ధ్వజరోహణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.