100వ జయంతోత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తింపు

100వ జయంతోత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తింపు

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతోత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూర రెడ్డి సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు, జిల్లా మంత్రులకు, ఇన్‌ఛార్జ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.