'సంపూర్ణ పేదరిక నిర్మూలన ప్రభుత్వ ధ్యేయం'

కృష్ణా: సంపూర్ణ పేదరిక నిర్మూలన ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డలో సూపర్ సిక్స్ విజయోత్సవ సభ జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం-2 పథకాలతో నియోజకవర్గ మహిళలకు రూ.42.20 కోట్లు లబ్ది కలిగిందన్నారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణ, అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత పాల్గొన్నారు.