'వినాయక చవితిని శాంతియుతంగా జరుపుకోవాలి'

SRPT: వినాయక చవితి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని నడిగూడెం మండలం ఎస్సై అజయ్ కుమార్ సూచించారు. ఇవ్వాళ పోలీస్ స్టేషన్‌లో వినాయక చవితి ఉత్సవ కమిటీల సభ్యులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక ఉత్సవ కమిటీల సభ్యులు మండపం ఏర్పాటు కోసం పోలీస్ స్టేషన్‌లో అనుమతి తీసుకోవాలని సూచించారు.