బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి

MBNR: ఇటీవల దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్న ముగ్గురు వ్యక్తులు సమీపంలో ఉన్న క్వారీలో నీటిలో మునిగిపోయి మరణించిన విషయం తెలిసిందే.బాధిత కుటుంబీకులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం పరామర్శించారు. ముగ్గురు చనిపోతే కనీసం కలెక్టర్,ఎస్పీ వచ్చి ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలని ఆదుకోవాలన్నారు.