భారీ వర్షాలు..రోగాలు ప్రబలకుండా చర్యలు..!

HYD: గ్రేటర్ HYD వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలకు రోగాలు ప్రబలకుండా జీహెచ్ఎంసీ యంత్రాంగం చర్యలు చేపడుతుంది. మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో ఎంటమాలజీ టీం యాంటీ లార్వా ఆపరేషన్ చర్యలు చేపట్టింది. ప్రతి ఇంటింటికి తిరిగి క్రిమిసంహారక రసాయనాలను సైతం పిచికారి చేస్తున్నట్లుగా పేర్కొంది.