చెరువులో మృతదేహం లభ్యం

BHNG: బీబీనగర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో గుర్తుతెలియని మృతదేహం శనివారం లభ్యమైంది. బీబీనగర్ పోలీసులు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుడు హైదరాబాద్‌లోని వారసిగూడకు చెందిన సాయి కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.