రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
రెండోవిడత పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. ఏప్రిల్ 2 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానంతో పాటు పలు బిల్లులపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ క్రమంలో తమ ఎంపీలకు బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశారు.