'ప్రతి ఒక్కరు వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి'
NLR: వలేటివారిపాలెం మండలంలో కుక్కలకు సోకుతున్న చర్మవ్యాధుల పట్ల పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ చెన్నకేశవులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. మాంసం దుకాణాల వద్ద కోడి వ్యర్థాలు తినడం వల్లే ఈ సమస్య వస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యాధి కుక్కల నుంచి మనుషులకు గాలి ద్వారా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.