టెండర్లను స్థానికులకే ఇవ్వాలి

టెండర్లను స్థానికులకే ఇవ్వాలి

నిర్మల్: ప్రభుత్వ శాఖలలో తాత్కాలిక ఉద్యోగుల నియామకాల్లో మ్యాన్ పవర్ ఏజెన్సీ టెండర్లను స్థానికులకు ఇవ్వాలని మాజీ కేంద్రమంత్రి సీనియర్ నాయకులు సముద్రాల వేణుగోపాలచారికి జిల్లా ఏజెన్సీ నిర్వాహకులు ఆదివారం వినతిపత్రం అందజేశారు. గతంలో నిర్వహించిన ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ జిల్లాలో నిర్వహిస్తున్న టెండర్లలో పాల్గొన్నారని ఆరోపించారు.