VIDEO: విపత్తు సేవలకు స్కౌట్స్ సన్నద్ధం: ఎస్పీ
అన్నమయ్య: మొంథా తుఫాను విపత్తు పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించడానికి జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ లీడర్లు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా, జిల్లా స్కౌట్ కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలోని బృందం సోమవారం సాయంత్రం రాయచోటి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.