ఒకే ఒక్కడు.. 26 కేసుల్లో నిందితుడు!
VSP: విశాఖలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అచ్చి మహేష్ రెడ్డిని గాజువాక క్రైమ్, సీసీఎస్, మల్కాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పెందుర్తి (10), గాజువాక (8), మల్కాపురం (2)తో పాటు ఇతర ప్రాంతాల్లో మరో ఆరు కేసులు నమోదయ్యాయి. అతని వద్ద నుంచి కేజీన్నర బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, BMW కారు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నాట్లు పోలీసులు తెలిపారు.