జస్టిస్ గిరిజ ప్రియదర్శిని మృతి పట్ల సంతాపం

JN: జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జీగా సేవలందించిన జస్టిస్ ఎం. గిరిజ ప్రియదర్శిని మృతి పట్ల జిల్లా న్యాయవాదులు, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీందర్ సంతాపం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు ఆమె అందించిన సేవలు మరువలేనివని, ఆమె మృతితో కోర్టులకు తీరనిలోటు ఏర్పడిందన్నారు. ప్రజలకు అందే తక్షణ న్యాయమే ఆమెకు మనం చెల్లించే నిజమైన నివాళి అవుతుందని అన్నారు.