నర్సాపూర్ లో యువకుడి అదృశ్యం
MDK: నర్సాపూర్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా అప్పుల పాలైన యువకుడు అదృశ్యమయ్యాడు. ఎస్ఐ జగన్నాథం తెలిపిన వివరాల ప్రకారం, నాగభూషణం కుమారుడు చరణ్ మొబైల్ షాపులో పనిచేస్తూ బెట్టింగ్‌కు అలవాటు పడి అప్పుల్లో కూరుకుపోయాడు. ఈనెల 1న ఇంటి నుంచి వెళ్లిన చరణ్ తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.