బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన
సత్యసాయి: పుట్టపర్తి ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన శనివారం బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. జిల్లాలోని పురోహితులు, పాస్టర్లు, కాజీలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పెళ్లి సమయంలో ఆధార్ కార్డు కాకుండా అమ్మాయి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం ప్రామాణికంగా తీసుకోవాలన్నారు.