పూడిమడక ఉప్పుటేరును సందర్శించిన ఎమ్మెల్యే

AKP: అచ్యుతాపురం మండలం పూడిమడక ఉప్పుటేరులో పరిశ్రమల వ్యర్థాల కారణంగా చేపలు మృతి చెందుతున్నాయి. దీనిని గురువారం యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కాలుష్య నియంత్రణ అధికారులతో కలిసి సందర్శించారు. చేపలు చనిపోవడానికి గల కారణాలు, పరిశ్రమల వ్యర్ధాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ఉప్పుటేరులో ఉన్న నీటిని పరీక్షలకు పంపించారు. నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.