BREAKING: రక్షణ శాఖ కీలక ప్రకటన

భారత రక్షణ వ్యవస్థ S-400 పూర్తిగా సురక్షితంగా ఉందని, దానిని ఎవరూ ధ్వంసం చేయలేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వస్తున్న తప్పుడు కథనాలను నమ్మవద్దని పేర్కొంది. మరోవైపు, సరిహద్దుల్లో పాక్ దాడులకు పాల్పడుతోందని భారత సైన్యం వెల్లడించింది. అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ పైకి పాక్ డ్రోన్లను పంపగా, వాటిని వెంటనే కూల్చేశామని తెలిపింది.