'ప్రమాద సమయాల్లో రెస్క్యూ సేవలు అత్యంత కీలకం'
BHPL: ప్రమాద సమయాల్లో ప్రాణాలను కాపాడే మైన్స్ రెస్క్యూ బృందాల సేవలు అత్యంత కీలకమని సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి అన్నారు. నాగ్ పూర్ లో జరిగిన 54వ ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన ఉద్యోగులను మంగళవారం జీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ2 జీఎం, పర్సనల్ జీఎం తదితరులు పాల్గొన్నారు.