VIDEO: ప్రత్యేక అలంకరణలో వన దుర్గా భవాని మాత

VIDEO: ప్రత్యేక అలంకరణలో వన దుర్గా భవాని మాత

MDK: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని మాతకు ఇవాళ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి మంజీరా నదీజలాలతో అభిషేకం చేసి, పట్టువస్త్రాలు, రంగురంగుల పుష్పాలతో మనోహరంగా అలంకరించారు. సహస్రనామార్చన, కుంకుమార్చన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.