విషజ్వరాల వ్యాప్తి.. మెడికల్ క్యాంపు ఏర్పాటు

NLR: నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విషజ్వరాల బారిన పడిన విద్యార్థినులకు ప్రత్యేక చికిత్స అందించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. దాంతో జ్వరాల బారిన పడిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు పాఠశాలలో వైద్యారోగ్య సిబ్బందితో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఆత్మకూరులోని అన్ని హాస్టళ్లలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.