ప్రారంభమైన మంచినీటీ పైప్‌లైన్ మరమ్మతు పనులు

ప్రారంభమైన మంచినీటీ పైప్‌లైన్ మరమ్మతు పనులు

GNTR: ప్రత్తిపాడు పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో వారంరోజుల నుంచి త్రాగునీరు రావటం లేదని కాలనివాసులు మంగళవారం ఆందోళనలు నిర్వహించిన నేపథ్యంలో పంచాయతీ అధికారులు స్పందించారు. జగనన్న కాలనిలోని మంచినీటి పైప్‌లైన్ రిపేర్ పనులను ఈరోజు సాయంత్రానికి పూర్తి చేసి, మంచినీటిని అందిస్తామని ఇన్‌ఛార్జ్ పంచాయతీ కార్యదర్శి షేక్ ఖాజావలి తెలిపారు.