ప్రధాన రహదారిని నూతనంగా నిర్మించాలని వినతి
MNCL: మందమర్రి మండలంలోని ఆదిల్ పేట దగ్గర ప్రారంభమై రోడ్డు జైపూర్ మండలంలోని రసూల్ పల్లె వరకు 7 గ్రామాలకు లింక్ గల ప్రధాన రోడ్డును నూతనంగా నిర్మించాలని BJP నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం మండల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రహదారి సరిగ్గా లేక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని వాపోయారు. స్పందించి రోడ్డును పూర్తిస్థాయిలో నూతనంగా నిర్మించాలని కోరారు.