VIDEO: అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా: ఏఈ

VIDEO: అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా: ఏఈ

SRPT: విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతరం సరఫరా చేయాలనే లక్ష్యంతో బస్తీబాట నిర్వహిస్తున్నట్లు మండల విద్యుత్ శాఖ ఏఈ సురేందర్ తెలిపారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పలు వార్డుల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించి మాట్లాడారు. ప్రతి మంగళ, గురు, శని వారాల్లో గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు బస్తీబాట నిర్వహిస్తున్నామన్నారు.