మారుటేరు 'కిసాన్ మేళా'కు రైతన్నలు
పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరులో ఈరోజు 'కిసాన్ మేళా' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్న రైతులకు బస్సును రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతన్నలు అందిపుచ్చుకోవాలన్నారు.