ముమ్మరంగా వాహనాల తనిఖీ
KMR: పెద్ద కొడప్గల్ మండలంలోని అంజనీగేటు జాతీయ ప్రధాన 161 రహదారిపై శుక్రవారం ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మద్యం, డబ్బు, నిషేధిత పదార్థాలను రవాణా చేస్తే సీజ్ చేయటం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.