పోలీస్ పీజీఆర్ఎస్‌కు 82 ఫిర్యాదులు

పోలీస్ పీజీఆర్ఎస్‌కు 82 ఫిర్యాదులు

AKP: పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. వాటిలో 24 భూతగాదాలు, నాలుగు కుటుంబ కలహాలు, ఐదు మోసానికి సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించి ఏడు రోజుల్లోగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.