ఢిల్లీ పేలుడుపై అమిత్ షా స్టేట్‌మెంట్

ఢిల్లీ పేలుడుపై అమిత్ షా స్టేట్‌మెంట్

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఐ20 కారులో పేలుడు జరిగినట్లు తెలిపారు. 'ఎర్రకోట సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పేలుడు జరిగింది. ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నాం. ఢిల్లీ సీపీ సహా ఉన్నతాధికారులతో మాట్లాడా. దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించాం' అని వెల్లడించారు.