'ఆదాని సిమెంట్ కంపెనీని వెంటనే రద్దు చేయాలి'
VSP: పెదగంట్యాడ వద్ద ఏర్పాటు చేస్తున్న ఆదాని అంబుజా సిమెంట్ కంపెనీని కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. గాజువాక, మల్కాపురం, స్టీల్‌జోన్ కమిటీలు మూడు రోజులపాటు ఆటో ర్యాలీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. గంగవరం పోర్ట్ కాలుష్యాన్ని అరికట్టి, స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని మంగళవారం కోరారు.