నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
BDK: భద్రాద్రి జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అధికారులు, అనధికారులు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.