ఏడాదిలో 125 రోజుల పనిదినాలు: APO
CTR: ఉపాధి హామీ పథకాన్ని మార్పు చేస్తూ ప్రవేశ పెట్టిన VBG-రామ్ పథకంలో ఇకపై శ్రామికులకు ఏడాదిలో 125 రోజుల పనిదినాలను కల్పించడం జరుగుతుందని APO శ్రీనివాసులు తెలిపారు. నూతన చట్టంపై సదుం MPDO కార్యాలయంలో సోమవారం మండల స్థాయి చైతన్య సదస్సు నిర్వహించారు. ఏప్రిల్ 1 నుంచి నూతన చట్టం అమలులోకి రానున్నట్లు చెప్పారు. వ్యవసాయ సీజనల్ 60 రోజుల పాటు పనులకు విరామం ఉంటుందన్నారు.