గ్రోయిన్ మరమ్మత్తులకు శంకుస్థాపన

గ్రోయిన్ మరమ్మత్తులకు శంకుస్థాపన

అనకాపల్లి మండలం తుంపాలలో ఎల్లయ్య గ్రోయిన్ మరమ్మత్తులకు కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోమవారం శంకుస్థాపన చేశారు. రూ.1.19 కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పని పూర్తయితే 1500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీనిని సకాలంలో పూర్తి చేస్తామన్నారు.