పైడితల్లమ్మ సిరిమానుకు ప్రత్యేక పూజలు

VZM: గంట్యాడ మండలంలోని పెంట శ్రీరాంపురం గ్రామంలో గురువారం పైడితల్లమ్మ సినిమానుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 12,13,14 తేదీల్లో పైడితల్లమ్మ పండగ నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఛైర్మన్ జగన్నాథం పైడిరాజు పాల్గొన్నారు.