బౌద్ధ ధమ్మ పరిషత్ పోస్టర్ ఆవిష్కరించిన MLA

బౌద్ధ ధమ్మ పరిషత్ పోస్టర్ ఆవిష్కరించిన MLA

ADB: ఇచ్చోడ మండల కేంద్రంలో ఈ నెల 16వ తేదీన బౌద్ధ ధమ్మ పరిషత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సోమవారం ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేశారు. గౌతమ బుద్ధుడు చూపిన శాంతియుత మార్గాన్ని అనుసరిస్తూ ప్రశాంత వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గణేష్, మాజీ ఎంపీటీసీ రమేష్, ధమ్మపాల్ పాల్గొన్నారు.