సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

కృష్ణా: మొవ్వ మండలం కాజ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సాయం సోమవారం అందించారు. ఆకురాతి నాగమల్లేశ్వరమ్మకు రూ.77,376, నారగం ఆనంద్ జగదీష్‌కు రూ.1,72,402 చెక్కులను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.