VIDEO: హోలీ రంగులతో పెనమలూరు ఎమ్మెల్యే
కృష్ణా: పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ కుటుంబ బంధాలు బలపడేలా, విభేదాలు తొలగేలా ప్రజలంతా ఐక్యతతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని పోరంకిలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ముందస్తు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.