ట్రాఫిక్ సిగ్నల్ స్తంభం ఒరిగిన వైనం
RR: షాద్‌నగర్ పట్టణ చౌరస్తా ముఖ్య కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ స్తంభం ఒరిగిందని వాహనదారులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం జన సంచారంతో నిండి ఉండే ముఖ్య కూడలిలో ప్రమాదం పొంచి ఉందని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలన్నారు.