యువత క్రమశిక్షణతో ఉండాలి: ఎమ్మెల్యే

యువత క్రమశిక్షణతో ఉండాలి: ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు మండలం పోరంకిలో APSSDC సహకారంతో, MLA బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా మంగళవారం జరిగింది. యువత ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో జీవించాలని సూచించారు. ఉద్యోగాలు, పెట్టుబడులు కోసం కూటమి ప్రభుత్వ చేస్తున్న కృషిని వివరించారు.