VIDEO: స్మృతి మంధాన ఇంట్లో పెళ్లి సందడి
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆమె తన ప్రియుడు పలాశ్ ముచ్చల్‌తో కలిసి ఈ నెల 23న ఏడడుగులు నడవనుంది. ఈ నేపథ్యంలో వారి మెహందీ వేడుక ఘనంగా నిర్వహించారు. ఇందులో టీమిండియా మహిళా క్రికెటర్లు పాల్గొని డ్యాన్స్‌లతో సందడి చేయగా, ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.