జిల్లాలో నేడు భిన్న వాతావరణం

SKLM: జిల్లాలో నేడు పలు చోట్ల భిన్న వాతావరణం ఉంటుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. APSDMA వివరాల ప్రకారం.. పలు మండలాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయని, వడగాలులు వీచే అవకాశం లేదని తెలిపింది. మరోవైపు పలుచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంక కూర్మనాథ్ పేర్కొన్నారు.