ఓ డాక్టర్ సారు ..ఎప్పుడొస్తారు..?

ఓ డాక్టర్ సారు ..ఎప్పుడొస్తారు..?

కర్నూల్: ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. దీంతో రోగులు వైద్యుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితి వస్తే మా గతి ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా వైద్యాధికారులు స్పందించి ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.