'లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం'
SRCL: గర్భస్థ పూర్వపిండలింగ నిర్ధారణ నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలోని ప్రైవేట్ ఆసుపత్రిల స్కానింగ్ సెంటర్‌లను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఎవరైనా లింగనిర్ధారణ చేసినట్లు తెలిస్తే రూ. 10 వేలతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామన్నారు. ప్రతి స్కానింగ్ సెంటర్ నియమ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.