'మున్సిపాలిటీ అభివృద్ధిలో వృద్ధుల భాగస్వామ్యం భేష్'!
నల్గొండ నగర సమగ్ర అభివృద్ధికి పౌరులు తమ వంతు బాధ్యతగా ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ బీ.శరత్ చంద్ర పిలుపునిచ్చారు. పన్నుల చెల్లింపులో సీనియర్ సిటిజన్లు చూపుతున్న చైతన్యం అభినందనీయమని, వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు గడువులోగా పన్నులు చెల్లించాలని కోరారు.